[ధరల పెరుగదలకు ప్రజల కొనుగోలు శక్తే కారణం - పవార్ వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ప్రజల కొనుగోలు శక్తి ఎక్కువై, తెగ కొని పారేస్తున్నారట. అందుకే ధరలు పెరిగాయట. ఎన్సీపీ నేత, కేంద్ర ఆహారశాఖ మంత్రి శరద్ పవార్ సూత్రీకరించాడు. మొన్నామధ్య అమెరికా అప్పటి అధ్యక్షుడు బుష్ కూడా ఇదే కదూ అన్నాడు, భారతీయులు తెగ తినేస్తున్నానారనీ, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు పెరిగాయని?
సుబ్బారావు:
అవును మరదలా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మాంద్యం వచ్చి ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గింది అని, దాని పర్యవసానంగా పన్నుల వసూళ్ళు కూడా తగ్గాయని ఒకసారి చెప్పారు. కరువు, వరదలు వలన పంటలు బాగా పండలేదని ఒకసారి చెప్పారు. గత సంవత్సరం కంటే పంటల ఉత్పత్తి శాతం పెరిగిందని మరో సారి చెప్పారు. మళ్ళీ అదే పవార్ లు, కేంద్రప్రభుత్వాలు, ఐరాసలు, ప్రజలలో దారిద్రరేఖకు దిగువనున్న వారి శాతం 40% కి పైగా పెరిగిందని అన్నారు. అంతేకాదు, ధరలు డిమాండ్ - సప్లై సూత్రాన్ని అనుసరించి ఉంటాయనీ అంటారు. అదే చిత్రం మరి! ఏది నిజమో ఎవరికీ అర్ధం కాదు.
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఇంత అలవోకగా నాలుక తిప్పగలరు కాబట్టే పవార్ ని ఒకప్పుడు మీడియా, కేంద్రంలో నెం.2 స్థానంలో ఉన్నాడనీ, రేపో మాపో ప్రధాని అయిపోతాడనీ తెగ పొగిడి పారేసింది.
సుబ్బారావు:
ఓహో! అయితే అవసరాన్ని బట్టి, అవసరమైన భాష్యం చెప్పగలిగితే, వాళ్ళని మీడియా పొగిడి పారేస్తుంది కాబోలు మరదలా?
Monday, February 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment