[ధరలు దిగిరావాలంటే... - ముఖ్యమంత్రుల సదస్సులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]
>>>టోకు ధరలకు, చిల్లర ధరలకు చాలా వ్యత్యాసముంటోంది. మనకు చాలా పోటీ అవసరం. అందుకే చిల్లర అంగళ్ల రంగంలో వాణిజ్యాన్ని ఆహ్వానించే అంశాన్ని మనం గట్టిగా పరిశీలించాలి.
సుబ్బలష్షిమి:
బావా! మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచ ప్రసిద్ద ఆర్ధిక వేత్త్త కదా? మరి, చిల్లర అంగళ్ళ రంగంలో పోటీ అవసరం, అప్పుడే ధరలు దిగొస్తాయి అంటాడేమిటి? అందరూ సిండికేట్ అయ్యి, అక్రమ నిల్వలుంచి, నల్ల బజారు విక్రయాలు జరుపుతుండ బట్టి కదా ధరలు పెరుగుతున్నాయి? సిమెంట్ కంపెనీలు ఈ విషయాన్ని చాలాసార్లు నిరూపించాయి కదా! ఈ ప్రభుత్వమే చాలా సార్లు సిమెంట్ కంపెనీలు సిండికేట్ అయితే ఊరుకోమని చెప్పింది కూడా! ఈ ఆర్ధిక వేత్తకి ఇంగిత జ్ఞానం [comman sense] తక్కువైనట్లుంది కదూ!
సుబ్బారావు:
కాదు మరదలా! స్వార్ధ పరిజ్ఞానం ఎక్కువైంది. కావాలంటే అదే శీర్షికలోని మరో పేరా చూడు.
>>>ధరలు దిగి రావాలంటే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.
సుబ్బలష్షిమి:
అంటే ఇక భారతదేశంలో కిరాణా దుకాణాలు కూడా విదేశీ సంస్థల చేతికి ఇవ్వాలనా? అప్పుడు ధరల దిగొస్తాయా?
సుబ్బారావు:
మరందుకే గదా మరదలా! మిశ్రమ ఆర్ధిక వ్యవస్థని తుంగలో తొక్కి, ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని వరసబెట్టి అమ్మి పారేస్తోంది? నిన్న NTPC ని కూడా అదే బాటన తోలేసారు.
సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఈ ఆర్దిక వేత్తకి ఇంగిత జ్ఞానం లేకపోవటం కాదు. ఇల్లుదోచి ఇతరులకి పెట్టే జ్ఞానం పుష్కలంగా ఉంది. అది తెలుసుకోలేకపోవటం మన అజ్ఞానం, అంతే!
Subscribe to:
Post Comments (Atom)
all gowdowns should be under open servilliance.
ReplyDeleteఇ౦గిత ఙ్ఞాన౦ లేనిది ప్రజలకు.....
ReplyDeleteహ హ, భలే చెప్పారు. చదవేస్తే ఉన్నమతి పోయిందనడానికి ఇదే ఋజువు
ReplyDeleteImmeture comments. When there is competition in retail sector, retailors pull goods from the suppliers than manufacturers push their goods. This is the very reason Walmart is able to supply all goods at very cheaper prices.
ReplyDeleteడింకి గారు : నెనర్లు.
ReplyDeleteమొదటి అజ్ఞాత గారు : మీరన్నది నిజమేనండి.
కొత్తపాళీ గారు : నెనర్లు :)
రెండవ అజ్ఞాత గారు : ఛ! నిజమా!