[బెంగాల్లో మావోయిస్టుల మెరుపుదాడి - 24 మంది జవాన్ల బలి - ఇది మా పనే - [కోటేశ్వరరావు అలియాస్] కిషన్ జీ, వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! ఈ మావోయిస్టులు ’తుపాకి గొట్టం తోనే విప్లవం వస్తుందనీ’, తాము ’ప్రజల కోసం పోరాడుతున్నామనీ’ అంటారు కదా! మరి శతృదేశాల నుండి దేశాన్ని కాపాడే జవాన్లని చంపటం ద్వారా విప్లవం ఎలా వస్తుంది? ప్రజల కోసమే పోరాడినట్లు ఎలా అవుతుంది?
సుబ్బారావు:
మావోయిస్టులు నిజంగా విప్లవకారులూ కాదు, ప్రజల కోసం, దేశం కోసం నిజంగా జ్వలించిపోవటమూ లేదు మరదలా! కాబట్టే మావోయిస్టులు జవాన్లనీ, పోలీసుల్ని చంపుతుంటారు. ప్రజల ఆస్థుల్ని ధ్వంసం చేస్తుంటారు. పొరపాటున కూడా... బ్లాక్ మార్కెటీర్ల, భారీగా అక్రమార్జనలు చేసి వందలేసి కోట్ల కూడబెట్టిన బ్యూరాక్రాట్ల, రాజకీయ నాయకుల జోలికిపోరు. కార్పోరేట్ వ్యాపారుల ఆస్థుల జోలికి అంతకంటే పోరు. వాటాలొస్తాయి మరి!
సుబ్బలష్షిమి:
నిజమే బావా! అందుకే కాబోలు, మాజీ నక్సల్స్ దందాలు చేస్తూ, ప్రైవేటు సెటిల్ మెంట్లు చేస్తూ బ్రతికేస్తున్నారు. బహుశః మాజీ నక్సల్ అంటూ జనజీవన స్రవంతిలో కల్సిపోవటం అంటే రిటైర్ మెంట్ లైఫ్ ఏమో? ఏవిధంగా చూసిన వీళ్ళ వలన ప్రజలకే నష్టం, కష్టం!
Subscribe to:
Post Comments (Atom)
@అమ్మఓడి గారు: నాకెం తెలవటం లేదు.. ఈ వ్యాఖ్యానం తో ఏమి చేయాలనుకుంటున్నారో... అది సాధిస్తున్నారా మీరు ?
ReplyDeleteఉగ్రవాదులు మావోయిస్టుల సూత్రం: మీ ఇంట్లో మేము బాంబులు కాల్చుకుంటాము. మీరు బైటికిపోయి కొవ్వొత్తులు వెలిగించుకోండి.
ReplyDeleteప్రజల్ని ఇప్పుడు యే నక్సలైట్లు కాపాడాల్సిన అవసరం లేదు ప్రజలు ఇప్పుడు చాలా తెలివి మీరారు ....అనడం కంటే ముదిరిపోయారని చెప్పవచ్చు...ఒకప్పుడు ప్రజలు దోపిడీ చేయబడ్డారేమో గానీ ఇప్పుడు మాత్రం ప్రతీ ఒక్కడు పక్కవాడికి జుళూక్ ఇవ్వగలిగే వారే ..నక్సలేటల అవసరం వాళ్ళకి లేదు ఈ గోలన్తా వాళ్ళ వునికి చాటుకోదానికీనూ ఏక్సిస్టెంస్ చాటుకోదానికే ...కానీ ఒక్క సారి ఆలోచించండి యన్ని కుటుమ్బాలు దిక్కుమాలినవయిపోతాయో ...యెంత మంధి పిల్లలు తండ్రిని కోల్పోయి జీవితాంతం తండ్రి లేని దుర్బరరాన్ని అనుభవించాలో ...
ReplyDelete