Saturday, February 27, 2010

వీళ్ళందరినీ చూసి భారతీయులుగా మనం నిజంగా సిగ్గుపడాల్సిందే!

[>>>భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు : ఎం.ఎఫ్.హుస్సేన్ కు ఖతార్ పౌరసత్త్వం ఇవ్వడాన్ని భారత్ లోని పలువురు ప్రముఖ కళాకారులు స్వాగతించారు. "అది ఆయనకు గొప్పగౌరవం" అని చిత్రకారిణి అంజోలి ఇలా మీనన్ అన్నారు. 95 ఏళ్ళ హుస్సేన్ నిజమైన కర్మయోగి అని ఆమె కితాబిచ్చారు. "స్వదేశంలో ఆయన్ను నీచంగా అవమానించారు. ఆయన విదేశీ పౌరసత్త్వాన్ని అంగీకరిస్తే.... నేను తప్పుపట్టను" అని ప్రముఖ సినీ దర్శకుడు శ్వామ్ బెనగల్ వ్యాఖ్యానించారు. - ఈనాడు వార్త నేపధ్యంలో

>>>దానిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందిస్తూ.. స్వదేశంలోకి రావడాన్ని వ్యతిరేకించబోమని, అయితే క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. హుస్సేన్ భారత్‌కు తిరిగి వస్తే పూర్తి స్థాయి భద్రత కల్పి స్తామని కాంగ్రెస్ పేర్కొంది. - ఆంధ్రజ్యోతి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పైవార్త చూశావా? హిందూ దేవతలని నగ్నంగా చిత్రించిన ఎం.ఎఫ్. హుస్సేన్ ’కర్మయోగి’ట. మరో ముస్లిం[నిజాం] పేరు పెట్టుకోవచ్చు గదా? పైగా అతడు స్వదేశం నుండి వెళ్ళిపోవాల్సి రావటం భారత ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని ప్రముఖ సినీ దర్శకుడు శ్వాం బెనగల్ అంటున్నాడు.

సుబ్బారావు:
అందుకు కాదు మరదలా, భారతీయులు హిందువులు సిగ్గుపడాల్సింది! ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి వాళ్ళు ఈ దేశం లో పుట్టినందుకు, అతడికి మద్దతు తెలిపే శ్వాంబెనెగళ్ లాంటి వాళ్ళు ఉన్నందుకు సిగ్గుపడాలి. మీడియా వీళ్ళని ప్రముఖులని చేసి, వీళ్ళంతా వెలిగి పోయారు గానీ, అసలు రంగులు ఇప్పుడే వెలికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ చూసి భారతీయులుగా మనం నిజంగా సిగ్గుపడాల్సిందే!

3 comments:

  1. ఈనాడు ఆదివారం అనుబంధంలో శ్యాం బెనగళ్ గురించి ,ఆయన ప్రతిభ గురించి, నలుపు -తెలుపు లలో అతను తీసిన సినిమాల గురించి ఊదరగొడుతుంటే -నిజంగానే ప్రతిభావంతుడేమో అనుకునేవాన్ని నా చిన్నప్పటినుడి ... ఇప్పుడు తెలుస్తుంది అతను అంత పోటుగాడు కాదని ,అతనంటే ఉత్తరాది వాళ్ళకే చాలామందికి తెలీదు అలాంటిది అతని గొప్ప దనం గురించి దక్షినాది వాళ్ళకి తెలియాలని కాబోలు ఈ వృధా ప్రయత్నం

    ReplyDelete
  2. hussein enta edava ee link custe telustundi.
    http://sridharchandupatla.blogspot.com/2007/11/non-sense-fellow-part-1.html

    ReplyDelete