Wednesday, February 24, 2010

అసలు సిసలు ఈనాడు మార్కు జర్నలిజం!

[ఎమ్యెల్యే మార్కు లీజు అని హెడ్డింగ్ క్రింద ఈనాడు వార్త నేపధ్యంలో.

>>>న్యూస్ టుడే, హైదరాబాద్:
ఆయన తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే. ఆయనకు ఎన్నో విద్యాసంస్థలు, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా, ఒక చిన్న స్థలంపై కన్నుపడింది. పార్కింగ్ కోసం కావాలంటూ ఆర్జీ పెట్టుకున్నారు. తన భార్య పేరిట అత్యంత చవకగా 30 ఏళ్ళపాటు లీజుకి పట్టేశారు. ఎమ్యెల్యే ఒత్తిడికి తలవంచిన అధికారులు దాదాపు కోటి రూపాయల విలువైన స్థలాన్ని నెలకు రూ.1500 రుసుముతో ధారాదత్తం చేశారు. ఈ అక్రమం వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో పాత హుడా లేఆవుట్ లో 350 గజాల స్థలం ఉంది. గతంలో ఇక్కడ పురాతన బావి ఒకటి ఉండేది. దీన్ని క్రమంగా పూడ్చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో... నగరంలో అధికార పక్షానికి వెన్నుదన్నుగా ఉండే పార్టీ నుండి గెలిచిన ఓ ఎమ్యెల్యే ఈ స్థలంపై కన్నేశారు. స్థలాన్ని పార్కింగ్ కు ఉపయోగించుకుంటామని, లీజుకి ఇవ్వమని కొన్నిరోజుల కిందట హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థ [హైమా] అధికారులను కోరారు. ఆరునెలల క్రిందట ఆ స్థలాన్ని ఇచ్చారు. అయితే పార్కింగ్ కి వినియోగించుకోకుండా చుట్టూ గొడకట్టి ఆ స్థలాన్ని ఎమ్యెల్యే తన ఆధీనంలో ఉంచుకున్నారు...... ఓ ఉన్నతాధికారి మాత్రం ఎమ్యెల్యే లీజు విషయం చాలా చిన్న వ్వవహారమని తేలికగా కొట్టేయటం గమనార్హం. - ఈ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ఈనాడులో వచ్చిన ’పై వార్త’ చదివావా? హైదరాబాద్ నగరంలో అధికారపక్షమైన కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉండే పార్టీ ఏది, ఎంఐఎం గాక! అదే డైరెక్టుగా వ్రాయవచ్చు గదా ఈనాడు? ఎమ్మెల్యే పేరు చెప్పకుండా, అతడి పార్టీ పేరు కూడా ఇంత డొంక తిరుగుడుగా ఎందుకూ చెప్పడం?

సుబ్బారావు:
అదే మరి అసలు సిసలు ఈనాడు మార్కు జర్నలిజం మరదలా! అన్ని వివరాలు తెలిసిన పత్రిక వారికి, ఎమ్మెల్యే పేరేమిటో, నియోజక వర్గమేమిటో, ఆ విద్యాసంస్థల వివరాలేమిటో తెలియవా? ఈ లోపున బేరం కుదుర్చుకోమని, సదరు ఎమ్మెల్యేకి ఈనాడు ఓ హెచ్చరిక ఇస్తోందన్న మాట. అప్పటికీ ఎమ్మెల్యే దిగిరాకపోతే రేపట్నుండి పేరూ, ఇతర వివరాలతో, వైనవైనాలుగా అతడి ఇతర అక్రమాలు కూడా బయటపెడతారు. అదీ అసలు సంగతి!

No comments:

Post a Comment