Wednesday, February 10, 2010

మానవహక్కుల సంఘాలున్నది నేరగాళ్ళ హక్కుల్ని రక్షించటానికే!

[కార్పోరేట్ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ క్రింద, మహిళల గర్భాశయానికి అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేయటం - మహిళల భౌతిక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో గర్బాశయానిది కీలక పాత్ర - ఆ కారణంగా గర్భసంచిని తొలిగించటమంటే ఆ మహిళను జీవిత చరమాకంలోకి బలవంతంగా నెట్టడమే - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకో సందేహం మానవహక్కుల సంఘాల వాళ్ళు కొన్ని విషయాల్లో సుమెటోగా కేసులు తీసుకుంటారు కదా! మరి కార్పోరేట్ ఆసుపత్రులలో అమాయక మహిళా రోగులకి, అనవసరంగా గర్భకోశం తొలిగించే ఆపరేషన్లు చేసి, డబ్బు గుంజుతున్నారన్న విషయంపైన సుమెటోలు స్వీకరించరెందుకని?

సుబ్బారావు:
ఓసి అమాయకురాలా! మానవహక్కుల సంఘాలున్నది నేరగాళ్ళ హక్కుల్ని రక్షించటానికే! ఆర్ధిక నేరగాళ్ళతో సహా! అలాంటి చోట కార్పోరేట్ ఆర్ధిక నేరగాళ్ళ జోలికి వెళ్తారేమిటీ!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! నేరస్తుల హక్కుల పరిరక్షణ కోసమే ఇలాంటి వాళ్ళు పనిచేస్తుంటారు.

7 comments:

  1. బాగా చెప్పారు. ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట. వీళ్ళ గొంతులు నక్సలైట్లనో, నరహంతకులను ఎన్‌కౌంటర్ చేసినపుడే ఎక్కువగా విన్నా.

    ReplyDelete
  2. చెప్పుదెబ్బలు - పూల దండలు గారు: చాలా కష్టపడి మంచి సమాచారం సేకరించి, వ్రాసారండి. ఇలాంటివి, మరిన్ని టపాలు మీనుండి రావాలని కోరుకుంటూ... ధన్యవాదాలు.

    రవిచంద్ర గారు : అవునండి. నేరగాళ్ళను కాపాడటానికే మానవహక్కుల సంఘం ఉందేమో కదా!:)

    ReplyDelete
  3. amma,
    How far below details are true.
    http://indianrealist.wordpress.com/2009/01/15/an-eye-opening-list/

    ReplyDelete
  4. అజ్ఞాత గారు : నెనర్లు.

    మలక్ పేట రౌడి గారు : నెనర్లండి.

    ReplyDelete
  5. www.innervoice.co.cc

    ReplyDelete