Monday, February 8, 2010

చక్కెర తినకపోతే ఎవరూ చావరు!

[చక్కెర తినకపోతే ఎవరూ చావరు - ఎన్సీపీ పార్టీ పత్రిక ’రాష్టవాది’ సంపాదకీయం - వార్తనేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్సీపీ పార్టీ పత్రిక రాష్ట్రవాది ’చక్కెర తినకపోతే ఎవరూ చావరు’ అంటుంది. పాపాయిల పాలల్లోకి సైతం చక్కెర కావాలి. కాఫీ టీలు లేనిది రోజు గడవదు చాలామందికి. వాళ్ళంతా ఏం కావాలి?

సుబ్బారావు:
ఇంకా నయం "అన్నం తినకపోతే ఎవరూ చావరు" అనలేదు సంతోషించు మరదలా!

సుబ్బలష్షిమి:
ఏమోలే బావా! రేపెప్పెడో అన్నా అంటారేమో. ఇంకా ఇలాగే సాగితే "ఆ! ఛస్తే ఛస్తారు. అయితే ఏమిటట?" అని కూడా అంటారేమో! ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో మంత్రి పదవులు, ఆదాయ వనరులూ అనుభవిస్తున్నారు. గుట్టు చప్పుడు గాకుండా తమ జీత భత్యాలు, ఇతర అలవెన్సులూ పెంచుకుంటున్నారు. బంధుమిత్రులకి సైతం, వివరాలడక్కుండా, ఎంత మందికైనా విమాన ప్రయాణ ఛార్జిలలో భారీ రాయితీలు మొన్నామధ్యనే కల్పించుకున్నారు. అదే ప్రజలకైతే "చక్కెర తిననంత మాత్రానా ఎవరూ ఛావరు" అని చెబుతున్నారు. ఏమనాలి బావా వీళ్ళనీ!

సుబ్బారావు:
రాజకీయ నాయకులనే అనాలి మరదలా! మరే జంతువుతోనైనా, వస్తువుతోనైనా పోల్చితే వాటిని అవమానించినట్లే!

No comments:

Post a Comment