Monday, February 22, 2010

బాగానే గిట్టుబాటవుతుంది మరి!

[అన్ని విభాగాల్లోకి లాభాలు వచ్చేది దక్షిణ మధ్య రైల్వేలో - లాభాలు వస్తాయని సర్వే నివేదికలు వచ్చిన చోట గాకుండా, నష్టాలు వస్తున్న మార్గాల్లోనే కొత్త రైళ్ళు వేయటం - ఇప్పటికి సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్లలో నడుస్తున్న ప్రక్రియ - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అందరిలోకీ తెలుగు వాళ్ళే ఎక్కువగా టిక్కెట్టు కొనుక్కుని మరీ ప్రయాణం చేస్తారు కాబోలు. దక్షిణ మధ్య రైల్వేకే లాభాలెక్కువట. అయినా సరే! లాభాలొచ్చే చోట గాకుండా, ఇప్పటికీ నష్టాలొస్తున్న మార్గాల్లోనే కొత్త రైళ్ళెందుకు వేస్తారు బావా?

సుబ్బారావు:
మరి అలా చేస్తేనే కదా మరదలా! కొన్నాళ్ళకి నష్టాలు తప్ప లాభాల్లేకుండా పోయేది? అప్పుడెంచక్కా నష్టాలొస్తున్నాయని చెప్పి అమ్మేయొచ్చు. ప్రైవేటీకరించవచ్చు. అప్పుడు వాళ్ళకు లాభాల పంటలు పండుతాయి. దేశం గతేమైనా, తమకి మాత్రం బాగానే గిట్టుబాటవుతుంది మరి!

No comments:

Post a Comment