Friday, February 12, 2010

చక్కెర తినకపోతే చావరు గాని, సినిమా చూడకపోతే ఛస్తారు కాబోలు!

సుబ్బలష్షిమి:
బావా! మొన్న తెలంగాణా జిల్లాలలో ’అదుర్స్’ సినిమా ప్రదర్శన కోసం ధియేటర్లకు పోలీసుల రక్షణ కల్పించారు. ఇప్పుడు ముంబైలో షారుఖ్ ఖాన్ సినిమా ’మై నేమ్ ఈజ్ ఖాన్’ కూ అదే స్థితి. ఇంతకూ పోలీసుల కర్తవ్యం, చివరకి సినిమా ప్రదర్శనలని రక్షించటం అయిపోయిందా?

సుబ్బారావు:
అవును మదరలా! చక్కెర తినకపోతే ఎవరూ చావరు గానీ, ’సినిమాలు టీవీలు చూడకపోతే మాత్రం ప్రాణాపాయ స్థితి’ అన్నట్లుంది వ్యవహారం. సినిమాలు కూడా ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు కదా! ఆర్దిక వ్యవస్థ పటిష్టతకు తప్పదు మరి!

సుబ్బలష్షిమి:
లోపం ఎక్కడుందో గాని... మొత్తానికి కొత్తకొత్త నిర్వచనాలు, సిద్దాంతాలు, పరిస్థితులూ పుడుతున్నాయి బావా!

1 comment:

  1. ఇలా మీరు అపరిపక్వంగా రాయటం ఏమీ బాగాలేదు. ఇది ఒక సినిమా గురించి కాదు. వ్యక్తి స్వేచ్ఛ కి సంబంధించిన అంశాలు ఇమిడి వున్నాయి. ఇలాంటి పెడ ధోరణుల వల్ల ముందు ముందు వచ్చే నష్టాలు అనుభవిస్తే గానీ తెలియదు. అప్పుడు మళ్ళీ మీ లాంటి వారే ప్రభుత్వ చేతకానితనం అంటూ విమర్శిస్తారు.

    ReplyDelete