Monday, February 22, 2010

సారాతాగి చచ్చిపోతే సమాజాన్ని ఉద్దరించినట్లా!

[ సారా మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారమివ్వాలి - చిరంజీవి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సారా తాగి మరణించిన వారి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయల పరిహారమివ్వాలని ప్రరాప నేత చిరంజీవి అంటున్నాడు. ఈ సారా వ్యసనపరులకి తమ మీద తమకి శ్రద్దా లేదు, తమ కుటుంబాల పట్ల బాధ్యతా లేదు. అలాంటి వాళ్ళు, సారా తాగి చచ్చిపోతే ప్రభుత్వం పరిహారమివ్వాలట. ఇదెక్కడి అడ్డదిడ్డపు రాజకీయం బావా!?

సుబ్బారావు:
ప్రభుత్వమే అడ్డదిడ్డంగా రాజకీయ వ్యాపారం, సారా వ్యాపారం చేస్తున్నప్పుడు, అన్నీ అడ్డదిడ్డంగానే ఉంటాయి మరదలా! వాళ్ళ వ్యసనం కొద్దీ వాళ్ళు, తాగి తాగి ఛస్తే... అదేదో ప్రజలనుద్దరించి చచ్చినట్లు పరిహారం ఇవ్వాలంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అటు స్వాతంత్ర సమర యోధులకైతే అతీగతీ లేదు గానీ....

5 comments:

  1. చాలా బాగా చెపారు.

    ReplyDelete
  2. మీ ఉద్దేశం అర్ధంఅవ్వలేదు.

    తాగుబోతు చనిపోతే అతనికి కాదుకదా పరిహారం ఇచ్చేది. అతడి పై ఆధారపడిన దౌర్భాగ్యులకు యిచ్చేది పరిహారం. మీరు చెపినట్లుగానే, తగుబోతు తన కుటుంబం పైనకుడా భాద్యత వుండదు. అది వారి కుటుంబాల తప్పు కాదు కదా!
    ఇది కేవలం చిరంజీవి డిమాండే కాదు, అన్ని పార్టీలు/నాయకులు ఎప్పటినుండో డిమాండే. ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వాలంటే,
    ప్రభుత్వ ఆదాయము కోసం సారా/మత్తు పదార్థాలను అనుమతిస్తుంది. అంటే వాటి వాళ్ళ ప్రజలకి కలిగే లోపాలకి /నష్టాలకి కుడా అంతే భాద్యత వహించి తీరాలి.

    నా అభిప్రాయము ప్రకారము, ఫించనలు తీసుకుంటున్న మాజీ స్వతంత్రయోధ్యలలో నకిలిలే ఎక్కువ. ఎందుకంటే, స్వాతంత్ర్యం వచ్చి 63 సంవత్సరాలు అయ్యింది. అంటే యోధులు కనీసం 63 + 18 = 81 సంవత్సరాలు అయినా వుండాలి. ఎంతమంది బతికి వుండే అవకాశం వుంది? ఇంకొక అభిప్రాయం ప్రకారం, ఏదైనా పోరాటం/త్యాగం నిస్వార్దంతోకూడుకున్నదై వుండాలి. కాని, 80+ సంవత్సరాల వయసులోకుడా ఇళ్ళ స్థలాలు తీసుకున్నారు చాలామంది పోరాట యోధులు. అవి ఎవరికోసం? వాళ్ళ మనవాళ్లకోసమా? మాజీ స్వతంత్రయోధ్యల చాలా మందిని చూసాను ఎటువంటి రాయతీలనూ తీసుకోని వారిని. అటువంటి వారని మనము గౌరవించాలి, ఆదరించాలి, ఆదుకోవాలి (వారి వారసులను కాదు). అంతేగాని, కలక్టరు కార్యాలదగ్గర మాకు మాజీ స్వతంత్రయోధ్యల ఫించనలు/ స్థలాలు కావాలని ధర్నా చేసేవారిని కాదు. నాకు స్వతంత్రయోధ్యలను అవమాన పరచడం నాఉదేశం కాదు. నకిలిలనే.

    ReplyDelete
  3. well said vasavya...

    ReplyDelete
  4. మరి సారా తాగి చావని వాళ్ళ పరిస్థితి ఏమిటీ? వాళ్ళ విషయంలో ప్రభుత్వానిది భాద్యత కాదా? వాళ్ళ కుటుంబాలు పడే నరకయాతనకి ఎవరు సమాధానం చెప్తారు?వాడు తాగీ తాగీ ఎప్పుడు చస్తాడో అని గోతి కాడ నక్కల్లాగా ఎదురు చూడాలా?........ సమాజాన్ని ఏమి ఉద్దరించారని తాగుబోతులకి కావల్సినంత సారా, వాళ్ళ మనవళ్ళకి డబ్బులూ ఇవ్వాలి, తాగుబోతులు చావడమే ఆ కుటుంబాలకి పెద్ద మేలు, తాగుబోతులని అన్నాళ్ళు భరించడం సమాజం వారికి చెసిన మహోపకారం, అంతకన్న ఇంకేమీ అవసరం లేదు వాళ్ళకి......చివరికి తాము స్వాతంత్ర్య సమరయోధులమని మంచి అబద్దం కుడా చెప్పట్లేదు కదా వాళ్ళు, లేదంటే ఒక గిలెటిన్ ఏర్పాటు చేసి వరసపెట్టి అందరినీ తెగనరుకుతూ వారి వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడం ఒక మంచి పద్దతి....

    ReplyDelete