Monday, February 8, 2010

అడుక్కు తినేవాళ్ళలాగా నటించండి[మారేశం] - అప్పుడు దాడులు జరగవు

[పేదల్లా కనబడితే దాడులు జరగవు - విక్టోరియా పోలీస్ ఛీఫ్ సైమన్, సమర్ధించిన విక్టోరియా ప్రధాని ... వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధులపై జరుగుతున్న దాడులు గురించి విక్టోరియా ఛీఫ్ సైమన్ అనే ఆసామి ’పేదల్లా కనబడితే దాడులు జరగవు’ అన్నాడట. దాన్ని విక్టోరియా ప్రధాని కూడా సమర్ధించాడట తెలుసా?

సుబ్బారావు:
ఇంకా నయం మరదలా! ’అడుక్కుతినేవాళ్ళ లాగా నటించండి[అంటే మారేశం అన్నమాట], అప్పుడు దాడులు జరగవు’ అన్నాడు కాదు.

సుబ్బలష్షిమి:
చూడబోతే ఏ దేశంలో అయినా... అధికారులూ, రాజకీయ నాయకులూ ఒకేలాగా ఉన్నట్లున్నారు బావా! సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళే, అదేమీ చెయ్యకుండా తీరికూర్చుని ఉచిత సలహాలిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ విఫలమైనట్లుంది!

6 comments:

  1. అయితే పేదవాడైన భారతీయునికి ఆస్ట్రేలియాలో చదువు ఉచితంగా దొరుకుతుందంటారా?

    ReplyDelete
  2. చిలమకూరు విజయమోహన్ గారు,
    ఇంత పెద్ద సందేహానికి సమాధానం సైమనే చెప్పగలడనుకుంటానండి :)

    ReplyDelete
  3. అమ్మో!ఇక్కడేమో ఠపఠపామని 'టపా'కాయలు పేలుస్తునారు....అక్కడేమో వళ్లో లాలిస్తూ 'నీతి'కథలూ,'గీత'ధర్మాలూ నేర్పేస్తున్నారు..మీ బహుముఖప్రజ్ఞకు నా మంగిడీలు....

    ReplyDelete
  4. కొందరు మాటలు చెప్తారు... మరికొందరు మాటలు రాస్తారు..

    ReplyDelete
  5. @కౌటిల్య గారు: నెనర్లండి :))

    @డింభకా గారు: నెనర్లు.

    ReplyDelete
  6. There is nothing wrong in what they said
    They suggested these measures with experience in
    crime prevention
    Similar advices are given all over the world to expats.
    we were advised similarly in moscow, iran and in USA
    Even we do it in India. it is no big secret.
    Overall Indians are fond of flashing their wealth and invite trouble.

    ReplyDelete