Saturday, July 3, 2010

ఇలాంటి పద్యం మీరెప్పుడయినా చదివారా?

[ఈనాడు హాయ్ బుజ్జీలో, వేమన పద్యం పేరిట ఈ రోజు[3 జూలై, 2010], ప్రచురితమైన

తనకు గలుగు పెక్కు తప్పులునుండగా
ఓగు నేర మెంచు నొరుల గాంచి
చక్కిలంబు జూచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

అర్ధం:
తనలో చాలా తప్పులున్నా అవేవి లేనట్లు, దుర్మార్గుడు, ఎదుటి వారిలోని తప్పులను బయటపెడుతూ ఉంటాడు. ఎలాగంటే - జంతిక తనలో ఉన్న ఎక్కువ వంకర్లను చూసుకోకుండా, తక్కువ వంకర్లున్న చక్కిలాన్ని వెక్కిరింటినట్లు! - పద్యం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వేమన పద్యం చూశావా కొత్తగా ఉంది! ఇంతకీ... జంతికలకీ, చక్కిలాలకీ తేడా ఏమిటో తెలుసా బావా! కొందరు అన్నిటినీ ’చక్రాలు’ అనే అంటారు మరి!

సుబ్బారావు:
ఇలాంటి కొత్త కొత్త పద్యాలు ‘ఈనాడు’ లోనే చూస్తున్నాను మరదలా! అసలవి నిజంగా వేమన పద్యాలో కావో కూడా తెలియదు. ఎప్పుడూ ఎక్కడా చదివినవి కావు. మన బ్లాగర్లలో ఎవరికైనా ఇలాంటి ‘కొత్త వేమన పద్యాలు’ తెలుసునేమో అడుగుదాం!

సుబ్బలష్షిమి:
‘పదుగురాడు మాట పాడియై ధరజెల్లును’ అన్నది పాత మాట. ‘మీడియా ప్రచారించిందే పాడియై ధరజెల్లును’ అనేది కొత్త మాటలా ఉంది బావా!

4 comments:

 1. ఆ వ్రాసిన శుంఠకి వేమన భాష ఏదో తెలిసినట్టులేదు. జంతికలు అని వేమన వాడే అవకాశం తక్కువ. ఎందుకంటే వేమనది అనతపురం/కడప ప్రాంతం వాడు. ఆప్రాంతంలో 'జంతిక ' అనే పదమే వాడరు, మురుకులు అంటారు.

  ReplyDelete
 2. వేమన పద్యములుగా అనేకము ప్రచారంలో ఉన్నాయి. ఐతే భాష, భావములు, లోకోక్తులు, చందస్సు, పదముల విరుపులు మొదలగు లక్షణాలను బట్టి పండితులు కొన్ని పద్యాలని వేమన పద్యాలుగా ధృవీకరించారు. వాటిలోని భావములు, సామాన్య లక్షణములు వేనిలో కనిపిస్తే వాటిని వేమన పద్యాలని నిశ్చయించవచ్చు.

  ReplyDelete
 3. మొదటి అజ్ఞాత గారు:నాకూ అదే సందేహం వచ్చిందండి. ఆ పద్యం ఎవరో నకిలీ వేమనదే అనుకున్నాను. నా సందేహం తీర్చినందుకు కృతజ్ఞతలు.

  రెండవ అజ్ఞాత గారు: మీ వివరణకి నెనర్లండి.

  ReplyDelete
 4. inthakee tappu ani dhruveekarinchi natlenaaa?

  ReplyDelete