Saturday, July 24, 2010

తమ నాయకుడి విగ్రహం నిర్మాణంలోనూ అదే అవినీతి!

[కడపలో కుప్పకూలిన వైస్ విగ్రహం: కడప నగరం తిరుపతి బైపాస్ సర్కిల్లో ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 15 రోజుల్లోనే కుప్ప కూలి పడిపోయింది. 17 అడుగుల విగ్రహం, 10 అడుగుల దిమ్మెతో కలిసి మొత్తం 27 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం కూప్పకూలింది.

బైపాస్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం రాయలసీమలో పెద్ద విగ్రహంగాను, వైఎస్ రూపురేఖలు అచ్చుగుద్దినట్లుగాను ఉన్నాయి.విగ్రహం పాదాల నుండి ఏర్పాటు చేసిన కమ్మీలు సెట్ అయ్యేందుకు కాంక్రీట్ సరిగా కలుపలేదు. ఇసుక , సిమెంట్, కంకర చిప్స్ సరిగా కలువలేదు. పొడిపొడిగా కనిపించాయి.

మొత్తంమీద చూస్తే విగ్రహం దిమ్మెపైన ఏర్పాటు చేయడంలో సాంకేతికపరమైన జాగ్రత్తలు పాటించలేదన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహం పునఃప్రతిష్ఠకు ముందు శాంతియాగం చేస్తున్నట్లు కూడా మేయర్ పేర్కొన్నారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కడపలో వై.యస్. విగ్రహం పెట్టిన 15 రోజుల్లోనే కూప్పకూలిందట. ఇసుక, సిమెంట్, కంకర చిప్స్ సరిగా కలపలేదట! విగ్రహం పునఃప్రతిష్ఠకు ముందు శాంతియాగం చేస్తున్నట్లు మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి చెప్పాడు, బావా!

సుబ్బారావు:
అంతే మరదలా!’నీవు నేర్పిన విద్యయే...’ అన్నట్లు చివరాఖరికి తమ నాయకుడి విగ్రహం నిర్మాణ విషయంలో కూడా అదే అవినీతి చూపించారు. శాంతి యాగం కాదు ముందు నిజాయితీ నేర్చుకుంటే అప్పుడు కట్టడాలు కలకాలం నిలుస్తాయి మరదలా!

సుబ్బలష్షిమి:
బావా! నీకో కొసమెరుపు చెప్పమంటావా! నంద్యాలలో క్రైస్తవుల సమాధుల చుట్టూ నిర్మించిన ఫెన్సింగ్ గోడ, మొన్న వరదల సమయంలో చుక్క నీరు కూడా గోడల నుండి లీక్ రాలేదు. చుట్టూ వరద నీరు గోడల మీదగా వచ్చి సమాధులు మునిగాయి. అంత పటిష్ఠతతో గోడ కట్టారు బావా!

సుబ్బారావు:
అంతే మరదలా! ఆ రోజు నిజాయితీ అది. ఈ రోజు అవినీతి ఇది.

3 comments:

  1. ఇంతకు ముందు తిరుపతిలో కూడా వైఎస్స్ కాంస్య విగ్రహం కూడా ప్రతిష్ఠకు ముందు పగిలిపోయింది అని కొన్ని నెలల ముందు వార్త చదివాను .

    ReplyDelete
  2. కూలిన విగ్రహం ఫోటో కూడా వేస్తె మీ పోస్ట్ నిండుగా వుండేది.
    అవినీతి సొమ్ముతో రాష్ట్ర మంతటా ప్రపంచం లో ఎక్కడా ఎవరికీ లేనన్ని విగ్రహాలను నెలకొల్పుతున్నారు.
    ఓదార్పు పేరుతొ చేస్తున్న తంతు ఇదే.
    చివరికి ఆ రూపం చూస్తేనే అవనీతి గుర్తొచ్చేలా చేస్తున్నారు.
    - యుగంధర్

    ReplyDelete
  3. చిలమకూరు విజయమోహన్ గారు: కాంస్య విగ్రహం కూడానా! :)

    యుగంధర్ గారు: సరిగ్గా చెప్పారు! నెనర్లు!

    ReplyDelete