Thursday, July 15, 2010

ఆప్పుడు వరుస బాంబు పేలుళ్ళు - ఇప్పుడు సోంపేట కాల్పులు, అంతే తేడా!

[పంట చేలో నెత్తుటి ధార - [సోంపేట] విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఆందోళన కారులపై పోలీసుకాల్పులు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2009 ఎన్నికలకు ముందు, వై.యస్.ఆర్. బ్రతికున్న రోజులలో ఓసారి, కాంగ్రెస్ అధిష్టానం సోనియా, అనంతపురం పర్యటనకి వచ్చింది, గుర్తుందా!? అప్పుడు ఇడుపుల పాయలో.... వై.యస్. కుటుంబసభ్యులతో, [కేవలం కుటుంబసభ్యులతో మాత్రమే] కలిసి భోజనం చేసింది. ఏయే వంటకాలు వడ్డించారో ఈనాడు పత్రిక విపులంగా జాబితా వ్రాసింది. గుర్తు కొచ్చిందా?

సుబ్బారావు:
గుర్తుకొచ్చింది మరదలా! ఆరోజు రైతులతో వై.యస్. "సోనియా గాంధీ గారు మన రాగి సంకటి రుచి చూశారూ. మీ సమస్యలు అర్ధం చేసుకున్నారూ" అంటూ దీర్ఘాలు కూడా తీసాడు. డీడీ, వాళ్ళ సభా కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేసింది కూడా! అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఆ రోజు అనంతపురం సభలో వైయస్సారు "అమ్మా! అక్కడ ఆడవాళ్ళు సర్దుకు కూర్చొండి. తోసుకోవద్దు! పిల్లలు నలిగిపోతున్నారు. సోనియా గాంధీ గారు చెబుతున్నారు, స్త్రీలు కొంచెం సర్దుకొండి తల్లీ!" అంటూ... ‘పాపం! ఎంతో కన్సర్న్ చూపించారు’. కెమెరా సోనియా వైపు తిరిగితే, ఆమె చేతులటు వైపు చూపిస్తూ ఉంది. అంత జాగ్రత్త, ప్రేమ తమకి పబ్లిక్ పట్ల ఉన్నాయంటారు కదా?

ఈ రోజు పచ్చటి పొలాలు[సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు] విద్యుత్ కేంద్రం వలన బీడు బారతాయంటూ ఆందోళన చేస్తూన్న వాళ్ళని అడ్డంగా కాల్చి చంపేసారే! మరి దీనికే మంటుంది అభినేత్రి సోనియా? అప్పటి బ్రిటీషు సర్కారుకీ, ఈ ఇటలీ మహిళ పాలనకీ తేడా ఏముంది బావా?

సుబ్బారావు:
ఆ రోజు ఎన్నికల అవసరం మరదలా! ఇప్పుడు ఈవీఎం లుండగా ఎవరితోనైనా పనేమిటి? అదీగాక... హఠాత్తుగా... సోంపేటలూ, కాశ్మీరు సమస్యలూ, పాక్ సరిహద్దు కాల్పులు గట్రా ‘హైజాక్ ’లు సృష్టించబడతాయి మరదలా! 2008లో పార్లమెంట్ లో ‘ఓటుకు నోటు’ బయటపడితే, జాతీయ స్థాయిలో ప్రజాదృష్టిని హైజాక్ చేయటానికి, నగరాలలో వరుసగా బాంబుపేలుళ్ళు జరిగాయి చూశావా!? అలాగే ఇప్పుడు రాష్ట్రస్థాయిలో, జగన్ Vs అధిష్టానం గొడవ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి సోంపేట లన్న మాట! అంత కౄరమైనది వీళ్ళ రాజకీయం!

5 comments:

  1. విద్యుత్ కేంద్రం వల్ల ఎంత మేర పంటలు పండవు? ప్రస్తుతం ఎంత పండుతోంది? ఈ విషయాలు తెలియందే చెప్పడం కష్టం. ఒకవైపు పారిశ్రామికీకరణ అంటారు, ఒకవైపు పరిశ్రమలు వద్దంటారు. పరిశ్రమలు పెట్టినా , పెట్టకున్నా దాడులు, పొలిటికల్ గొడవలు మామూలైపోతున్నాయి. ఇలా గొడవ చేసి, డబ్బు గుంజడం ధ్యేయంగా వుంటోంది.

    ReplyDelete
  2. > జగన్ Vs అధిష్టానం గొడవ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి
    సోంపేట లన్న మాట!
    is this true or just wild guess?

    ReplyDelete
  3. కేవలం తండ్రి పేరుతో పెద్దవాడు కాలేడు జగన్.... కడప లో మాత్రమే గెలుస్తాడు... రాష్ట్రం మొత్తం లో గెలవాలంటే అతన్ని పెద్ద వాడిని చేయాలి.... అందుకే ఈ డ్రామా అంతా... అంతకు మించి ఎమీ లేదు ... మీరు చెప్పండి... రాష్ట్ర స్థాయి లో మంచి ప్రజాధరణ గల ఒక్క కాంగ్రెస్ నాయకుడి పేరు

    ReplyDelete
  4. మొదటి అజ్ఞాత గారు: పత్రికలు చదువుతూ ఉండండి. మీకే అర్దమవుతుంది.

    రెండవ అజ్ఞాత గారు: సత్యేంద్ర గారు మీకు జవాబు ఇచ్చారండి. అదే నా జవాబు కూడా!నెనర్లు!

    కృష్ణగారు: వేచి చూడండి! :)

    సత్యేంద్ర గారు: కృతజ్ఞతలండి.

    ReplyDelete