Saturday, July 10, 2010

ఇండియా చేస్తే మూఢనమ్మకం, సింగపూర్ లూ, జర్మనీలూ చేస్తే శాస్త్రీయమూ నేమో!

[సాకర్ పుట్ బాల్ విజయాల గురించి ‘పాల్’ అక్టోపస్ చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పుట్ బాల్ మ్యాచ్ ల్లో ఏ దేశపు జుట్టు గెలుస్తుందో, ఎనిమిది కాళ్ళుండే అక్టోపస్ జోస్యం చెబుతుందట ‘పాల్’ అనే పేరున్న, ఆ అక్టోపస్ చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయట తెలుసా? అలాగే సింగపూర్ లోనూ చిలక చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయి? అదెలా సంభవం బావా?

సుబ్బారావు:
ఎవరికి తెలుసు మరదలా! క్రికెట్ కి మాదిరిగా ఫుట్ బాల్ మ్యాచులూ మ్యాచ్ ఫిక్సింగ్ లయితే, ఇక సింగపూర్ చిలకలూ,పాల్ లూ క్రానే లౌతాయి కదా? క్రానే గుర్తున్నాడా? క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ల రహస్యాన్ని బైట పెట్టాక విమాన ప్రమాదంలో మరణించాడు.

సుబ్బలష్షిమి:
గుర్తుంది బావా! అయినా నాకు తెలియకడుగుతాను, ఒకప్పుడు మనదేశ ప్రజలు సోదమ్మి జోస్యాలనీ, చిలక జోస్యాలనీ నమ్మితే తెగ ఎగతాళి చేశారు. మరిప్పుడు ‘పాల్’ జోస్యాలని టీవీలలో, పత్రికలలో చూపించి మరీ ఎలా ప్రచారిస్తున్నారు బావా?

సుబ్బారావు:
తాను చేస్తే లౌక్యమూ, మరొకరు చేస్తే మోసమూ అన్నాట్ట వెనకటి కెవరో. అలాగే.... అభివృద్ది దేశాలు చేస్తే ఆధునికత, వర్దమాన దేశాలు చేస్తే ఆనాగరికత అంటారు. ఒకప్పుడు ఇండియా చేస్తే మూఢనమ్మకం, సింగపూర్ లూ, జర్మనీలూ చేస్తే శాస్త్రీయమూ నేమో!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కాన్సెప్ట్ మనది, ప్యాకింగ్ మార్చి అదే విషయాన్ని వ్యాపారం చేసుకునేది తెల్లోళ్ళు! ఇదే కదా కార్పోరేట్ కంపెనీల వ్యాపార రహస్యం!

9 comments:

  1. బాగుంది. మూర్ఖులకి దేశ విదేశమనే తేడా వుండదు లెండి.

    ReplyDelete
  2. మీరిచ్చిన స్టేట్మెంట్ ఈ బ్లాగు మాలికలోని తింగర హేతువాదులకి వర్తిస్తుంది కాని, ఎవరు చేసినా హేత్బద్ధంగా వుంటేనే అది సహేతుకం అవుతుంది. మీకు ఇక్కడ తృప్తి పడాల్సిన విషయం ఏమంటే మనలాంటోళ్ళు అన్ని దేశాలలో వున్నారు, అని.

    ReplyDelete
  3. "తింగర హేతువాదులకి"

    Very good word.

    ReplyDelete
  4. గుంటూరు పొగాకుతో ఫారినోడు సిగరెట్లు చేసినట్టు....జయదేవ్

    ReplyDelete
  5. India అంటె చులకన లెండి అందరికి

    ReplyDelete
  6. వ్యాఖ్య వ్రాసిన అందరికి కృతజ్ఞతలండి!

    ReplyDelete
  7. మనిషన్నాక చాలా రోగాలు, రుగ్మతలు, ఉద్వేగాలు నానారకాల జాడ్యాలుంటాయి ..! అది మనిషి సహజ లక్షణం..! అంతే కాని..వాటికి ప్రాంతాలు. కులాలు, మతాలంటూ భేదాలుండవు మాస్టారు, మనదేశంలో ఉన్నట్లే అక్కడ ఉంటారు అలాంటి జాతక, వాస్తు, జ్యోతిష్యాలను నమ్మేవాళ్ళు.., ఇక్కడ నమ్మే జనాలున్నట్లే అక్కడ ఉన్నారు అంతే.! దానికి మీడియా పెద్ద ప్రాదాన్యత ఇచ్చిందిగాని...అదే ప్రపంచప్రజల ప్రమాణికం అన్నట్లు చెబుతారేటి..? ఎవరూ దానిని శాస్త్రీయం అని చెబుతున్నారు..? మన మీడియావాళ్ళా..? లేక అక్కడి ప్రభుత్వాల గుర్తింపు పొందిన లేక అత్యధిక ప్రజలు ఆమోదం పొందిన వ్యవస్థ చెబుతున్నదా...? మనోళ్ళకు న్యూస్ కావాలి..కోతికి కొబ్బరి చిప్ప దొరికింది..అంతే ! మీరేదో అది ప్రపంచదేశాల మద్దతుపొందిన ప్రక్రియ అని చెబుతుంటేను ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడున్నట్లే అక్కడా ఉన్నారు పిచ్చోళ్ళు..దొంగతనాలు చేసేవాళ్ళు. అది మనిషి యెక్క సహజ లక్షణం.

    ReplyDelete