Friday, July 9, 2010

అప్పుడే చెప్పింది ఆంధ్రజ్యోతా? ‘అమ్మఒడి’ బ్లాగా?

[ఆంధ్రజ్యోతి చెప్పిదంటే అక్షరాల నిజమే! అధిష్టానం పట్ల జగన్ వైఖరి గురించి నెలన్నర క్రితమే చెప్పిన ఆంధ్రజ్యోతి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అధిష్టానం పట్ల జగన్ వైఖరి గురించి, ఆంధ్రజ్యోతి నెలన్నర క్రితం నుండే పలు కథనాలు ప్రచురించిందని, సదరు పత్రిక గొప్పగా చెప్పుకుంటోంది. మరి ‘అమ్మఒడి’ బ్లాగు, జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు అంటూ, తొమ్మిది నెలల క్రితం నుండీ [oct.10, 2009 నుండి] చెప్పింది కదా బావా?

సుబ్బారావు:
ఎంత మాట అన్నావ్ మరదలా! వార్తా పత్రికలు వ్రాస్తే నిజాలు, బ్లాగులు వ్రాస్తే అబద్దాలని, ఈనాడు పత్రిక ఎప్పుడో చెప్పలేదా? మీడియా చెబితేనే నిజాలు గానీ, బ్లాగుల్లో చెబితే ఏముంది?

సుబ్బలష్షిమి:
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్పినా.... సత్యం సత్యమే కదా బావా! మీడియా చెప్పిందని అబద్దాలు నిజాలై పోవు, బ్లాగుల్లో చెప్పారని నిజాలు అబద్దాలై పోవు కదా!

సుబ్బారావు:
అయినా అంతే! అలా అనటం మీడియా హక్కుమరి!
~~~~~

240. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 02 [పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!] [Nov.03, 2009]

242. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 03 [ఎవరు ఎవరికి దాసోహం అన్నారు?] [Nov.05, 2009]

243. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 04 [ఏకాంత భేటీ వరకూ…] [Nov.06, 2009]

4 comments:

  1. lakshmi gaaru,appudae emaiyindi..july 20 nunchi september6 logaa kevalam india raajakeeyaalae kaadu,global political senaerio lo saitam penu maarpulu[melodraama]chotuchesukobottunnaai...jayadev,chennai-17

    ReplyDelete
  2. ఇంతకూ జగన్ ఎవరికి జంట ' పీత ' - చంద్రబాబుకా ? లేక పురందేశ్వరికా ?
    ఇప్పుడు జరిగే ఓదార్పు అంతా అతన్నీ జంట పీతగా తయారు చేసే క్రతువే

    ReplyDelete
  3. సుబ్బులక్షిమి: బావా అమ్మఒడి ఆంద్రజ్యోతి కన్నా ముందే చెప్పింది అంటే ఎవరు గొప్ప బావా?
    బావ: అమ్మఒడి చెప్పలేనిది చెప్పిన పాల్ ఆక్టోపస్ గొప్పది సుబ్బు లచ్చిమి. ఏదో తగులుకున్నంత మాత్రాన స్వంతంగా వీరతాళ్ళు వేసుకోకూడదు సుబ్బులక్షిమి, ఎవరితోనైనా వేయించుకోవాలి. మనకాళ్ళకు మనం దండంపెట్టుకుని నూరేళ్ళాయిష్షు అని దీవించుకోకే పిచ్చి సుబ్బు లక్ష్మి.
    సుబ్బులక్షిమి: అవును బావా!

    ReplyDelete
  4. jaya Dev గారు, మొదటి అజ్ఞాత గారు: వేచి చూద్దామండి! :) నెనర్లు!

    రెండవ అజ్ఞాత గారు:‘ఈనాడు ఎప్పుడో చెప్పింది. ఆంధ్రజ్యోతి అప్పుడే చెప్పింది’ అంటూ ఆ పత్రికలు తమ కాళ్ళకు తామే దండాలు పెట్టుకుని, తమను తామే నూరేళ్ళాయిష్షు అని దీవించుకుంటున్నాయి కదా అజ్జాత గారు! మరి వాళ్ళకు వీరతాళ్ళు ఎవరు వేస్తున్నారు? సాటి బ్లాగరో, బ్లాగు పాఠకులో అయితే వ్యక్తిగతం మీదకి వచ్చేంత కోపం మీకు రాదు. బహుశ ప్రత్యేక వ్యక్తి అయి ఉంటారు. :)

    ఇకపోతే.... నేను నా గొప్పదనం గురించి చెప్పుకోలేదు. బ్లాగుల్లో వ్రాస్తే నిజాలైనా అబద్దాలే, పత్రికలు వ్రాస్తే అబద్దాలైనా నిజాలే అని పత్రికలు అనడాన్ని ఎత్తి చూపించాను. ఇక ఆపైన మీ విజ్ఞత!

    ReplyDelete