Thursday, July 1, 2010

మీరంతా ఏడుస్తూ ఇడుపులపాయ రండి. మేమొచ్చి మిమ్మల్ని ఓదార్చుతాం!

[ఓదార్పు యాత్ర వద్దని జగన్ కి సోనియా సూచించిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జగన్, తండ్రి వై.యస్. చనిపోయినప్పుడు, మృతి చెందిన అభిమానులని ఓదారుస్తానంటూ యాత్ర చేపడతానంటాడు. సోనియా వద్దంటోందట. ఖమ్మంలో యాత్ర సజావుగానే జరిగినా, వరంగల్ లో తెరాస శ్రేణులు, తెలంగాణా వాదులూ అడ్డుకున్నారు. చివరగా ‘నో’ అంటూ సోనియా పైకి తేలింది. అంటే అప్పుడు వరంగల్ లో అడ్డుకున్న వారి వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది బావా?

సుబ్బారావు:
ఇంకెవరిది? సోనియాదేనని స్పష్టంగా తేలింది కదా మరదలా!

సుబ్బలష్షిమి:
పైగా.... అందరినీ ఒకేచోట చేర్చి, వాళ్ళని కలిసి, సాయం అందించాల్సిందిగా సోనియా సూచించిందట. ‘మీరంతా ఏడుస్తూ ఇడుపులపాయ రండి. మేమొచ్చి మిమ్మల్ని ఓదార్చుతాం. ఆపైన ఫోటోలు తీసుకుని పేపర్లో, వీడియోలు తీసుకుని టీవీలో వేస్కుంటాం’ అనాలన్న మాట! ఎంత గొప్ప సంస్కారం బావా? బాధల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తారా, వాళ్ళని మన దగ్గరికి పిలిపించి ఓదారుస్తారా?

సుబ్బారావు:
బహుశః అది సోనియా సాంప్రదాయమేమో మరదలా!

3 comments:

  1. బాధల్లో ఉన్న వాళ్ళను ఊదార్చ దానికి అంత భాదరబంది అవసరమా అన్నయ్య. కాస్త రెండు వైపులా చూసి రాయీ. నీ చేతిలో బ్లాగ్ ఉంది అని నువ్వు నచినట్టుగా రాస్తున్నావు ఒక పోలీసు వాడు అధికారం ఉందని లాటి ఘులిపిస్తున్నాడు. రెంటికి పెద్ద తేడా ఏంటో. జగన్ మనసులో ఏముందో అందరికి తెలుసుగా. ఎందుకు అతని సమర్దిస్తావు?

    ReplyDelete
  2. "అప్పుడు వరంగల్ లో అడ్డుకున్న వారి వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది బావా?

    సుబ్బారావు:
    ఇంకెవరిది? సోనియాదేనని స్పష్టంగా తేలింది కదా మరదలా!"

    Why Sonia has to care about him?
    His tour is not approved because he talks against Rosaiah and State govt. and every one knows why ?

    Your arguement is rediculous.

    ReplyDelete
  3. అజ్ఞాత గారు: జగన్ ను సమర్దించటం లేదు తమ్మీ! సోనియాను విమర్శిస్తున్నాను.

    హరీష్ గారు: నిజమే? లోపలి కథ తీరిగ్గా బయటకి వస్తుంది లెండి!అప్పుడు చూద్దురు గానీ!

    ReplyDelete