Saturday, July 10, 2010

అందుకే కదా, ప్రజల కోసం గాకుండా, సోనియా కోసం పనిచేస్తున్నాడు!

["మీకు సీఎం పదవిని సోనియా ఇచ్చారు. ప్రజలు ఎన్నుకుంటే రాలేదు." - రోశయ్య గురించి చంద్రబాబు విమర్శ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎంఎల్ సీ గా ఉండి సీఎం అయిన రోశయ్యని చంద్రబాబు, మీకు సీఎం పదవి ప్రజలివ్వలేదు, సోనియా ఇచ్చిందని విమర్శిస్తున్నాడు చూశావా!

సుబ్బారావు:
అందుకే గదా మరదలా! రోశయ్య తన శాయశక్తులా... ప్రజల కోసం గాకుండా, సోనియా కోసం పనిచేస్తున్నాడు. ‘అధిష్టానం ముద్రే తన ముద్ర’ అని ఢంకా బజాయించీ మరీ చెబుతున్నాడు. ఈ పాటి దానికి ఇది ప్రజాస్వామ్యమనే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మరదలా!

సుబ్బలష్షిమి:
నిజానికి వాళ్ళకి కాదు బావా దండలెయ్యాల్సింది, అది నిజమేనని నమ్మేవాళ్ళకి దండలేసి సన్మానం చెయ్యాలి!
~~~~~~

2 comments:

  1. amma soniyaa devi,telugu M.P/CM LANU BHAYAPEDUTUNDI...Tamila MP/CM/DCM LAKU BHAYAPADUTUNDHI.మన వాళ్ళు నపుమ్సుకుల కన్నా కనా కష్టం గా తగలడ్డారు మరి--------జయదేవ్

    ReplyDelete
  2. జయదేవ్ గారు : బాగా చెప్పారు. అయితే తమిళ కరుణానిధిని చూసి నిజంగా భయపడుతుందంటారా?

    ReplyDelete