[భారత స్వాతంత్ర విజయోత్సవం గురించీ, దేశ విభజన విషాదం గురించీ, భారత్ సింధ్ ల మధ్య అవిభాజ్య సంబంధం గురించీ - అద్వానీ ఆత్మకథలో ప్రస్తావన నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన ఆత్మకథలో, దేశ విభజన నాటి రోజుల విషాదం గురించి విశదీకరించాడు చూశావా! మాతృభూమిని కోల్పోయి, ఆస్థిపాస్థుల్ని పోగొట్టుకుని, ఆత్మీయులందరూ చెల్లాచెదురై పోగా, శరణార్ధులై లక్షలాది మంది సింధీలు భారత దేశానికి వలస వచ్చిన నాటి రోజుల గురించి చదివితే గుండెలవిసి పోయాయి.
నిజంగా అమ్మఒడి లాంటిది మాతృభూమి. దాన్ని కోల్పోవటం జీవితంలో అత్యంత విషాదకరం కదూ బావా! సింధ్ లో ధనికులుగా పరిగణింపబడ్డవాళ్ళు, ఇక్కడికి వచ్చాక రైల్వేస్టేషన్లలో వార్తాపత్రికలు అమ్ముకునే స్థాయికి పడిపోయారట!
సుబ్బారావు:
భారత దేశం నుండి కరాచీకి పెద్దఎత్తున [ముస్లింలు] ముజాహిర్లు చేరారట! కరాచీ నుండీ, సింధ్ లోని ఇతర ప్రాంతాల నుండి దాదాపు హిందువులంతా ఇళ్ళను వదలి వలసి వెళ్ళినప్పుడు, వారు వదిలిపెట్టిన భూములను, ఆస్తులను స్వాధీన పరుచుకునేందుకు, అక్కడి వారు ఉన్మాదంతో ఎగబడ్డారట!
ఇక అలాంటి వార్తలు ప్రచారం అయినప్పుడు, అటు నుండి ఇటు వలస వచ్చిన హిందువులలో పెరిగిన ఆక్రోశం, ఇటు నుండి అటు వలస వెళ్ళిన ముస్లింలో కలిగిన ఆశ, ఉత్సాహం.... వెరసి దేశ విభజన నాడు, మట్టి, రక్తంతో తడిసింది. మత విద్వేషాలు, మత ఘర్షణలుగా చరిత్రలో వ్రాయబడింది. రక్తం పారించిన కారణం మతం కాదు, ఆర్దికమే!
ఇవన్నీ వదిలేసి....క్రికెటర్ల జీవితం చరిత్రలని పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టారు. నిజానికి ఇలాంటి విషయాలని చరిత్ర పాఠాలుగా నేర్పాలి మరదలా! అప్పుడు గానీ జనాలకి, మాతృదేశాన్ని ఎందుకు కాపాడుకోవాలో అర్ధం కాదు.
సుబ్బలష్షిమి:
నిజం బావా! "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి!" అన్నాడు శ్రీరామ చంద్రుడు! ఆ నిజం ఎప్పటికి ఈ పదార్దవాదులకి అర్ధమౌతుందో!?
Subscribe to:
Post Comments (Atom)
baga chepparu
ReplyDeleteఇంకొక విషయ మేమిటంటె పేద ముస్లిం లందరిని ఇకడ వదిలేసి మంచి డబ్బున్న,వాపారం,అధికారం ఉన్న ముస్లిం లందరు పాకిస్థాన్ కి వెళ్లారు. ఇక్కడ ఎలైటెడ్ వారిలో మౌలానా అజాద్, అజిం హషిం ప్రేంజి నాయన లాంటి వారు ఒకరిద్దరు మిగిలారు. దీనివలన జరిగిన నష్టమేమిటంటె ఈ పేద ముస్లింస్ లో అధిక భాగం హిందూ మతం నుంచి మారిన వారు. భారత ములింస్ అంటె మిగత ముస్లిం వర్గాలవారు పఠానులు,షేక్ ,ఖాన్లు మొద|| పెద్దగా గుర్తించరు. చిన్న చూపు.
ReplyDeleteఅసలు దేశానికి స్వతంత్రం మన నాయకుల కృషి వల్ల వచ్చిందా ? ..లెక. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ యుద్దం లొ కన్ను లొట్ట బోయి బ్రతుకు జీవుడా అంటూ స్వాతంత్రం ప్రకటించారా ?
ReplyDeleteమొదటి అజ్ఞాత గారు: కృతజ్ఞతలండి.
ReplyDeleteరెండవ అజ్ఞాత గారు: నిజం చెప్పారండి. నెనర్లు!
క్రిష్ గారు: మంచి సందేహమే! నా గత టపాలలో [అమ్మఒడి బ్లాగులో] వివరంగా వ్రాసాను.