[దండయాత్రలా కాదు. ‘అధిష్టానం ఆలోచన’ పేరుతో రోశయ్య ప్రకటన నేపధ్యంలో....
>>>ఓదార్పు యాత్ర చేయాల్సింది దండయాత్ర మాదిరో, జైత్రయాత్ర మాదిరో కాదని ముఖ్యమంత్రి రోశయ్య హితవు పలికారు. అధిష్టానం ఎప్పుడూ ఓదార్పు యాత్రను వద్దనలేదని, జగన్ బహిరంగ లేఖలో పేర్కొన్నట్లు బాధిత కుటుంబాలను ఒకచోట చేర్పి ఆర్దిక సాయం, ఓదార్పు చేయవచ్చని సోనియా గాంధీ సూచించారని తెలిపారు. ]
సుబ్బలష్షిమి:
బావా! ముఖ్యమంత్రి రోశయ్య.... జగన్ ఓదార్పు యాత్ర బయలు దేరే ముందు వరకూ, తాను ఢిల్లీ వెళ్ళే ముందు వరకూ కూడా, అధిష్టానం ఓదార్పు యాత్ర వద్దందనీ, ఎం.ఎల్.ఏ. లెవరు అందులో పాల్గొన వద్దనీ, అధిష్టానాన్ని ధిక్కరించడం మంచిది కాదనీ అన్నాడు కదా! మరి ఢిల్లీ వెళ్ళి తిరుగు ప్రయాణం ముందు.... అధిష్టానం ఎప్పుడూ ఓదార్పు యాత్రని వద్దన లేదంటా డేమిటి? నిన్నటి దాకా ఢిల్లీలో... అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ దగ్గరి నుండీ కేకేలూ, వి.హెచ్.ల వరకూ అందరూ... ‘అధిష్టానం యాత్రకు వ్యతిరేకం. అంచేత ధిక్కరించవద్దంటూ’ జగన్ కు సుద్దులు చెప్పారు కదా? ఇదేం మడత నాలుక?
సుబ్బారావు:
అంతే కాదు మరదలా! మొన్నా మధ్య వీరప్ప మొయిలీ తనని ఆశీర్వదించి యాత్ర చేసుకో పొమ్మన్నాడన్నాడు జగన్. ‘ఠాఠ్’ నేనేం అలా అనలేదన్నాడు మొయిలీ! తనను అబద్దాల కోరుని చేశారని జగన్ ఘోల్లు మన్నాడు. ఆరోజు మొయిలీ జగన్ లలో... ఎవరు నిజం చెప్పారో, ఎవరు అబద్దం చెప్పారో ఎవరికీ తెలియదు గానీ, ఇప్పుడైతే విషయం మరింత బహిరంగ పడింది కదా?
సుబ్బలష్షిమి:
పోల్చి చూస్తే... అధిష్టాన బృందం Vs జగన్ శిబిరాలలో, క్రమంగా జగనే, ఎక్కువ పారదర్శకంగా, లోపల జరిగిన విషయాలు బయటపెడుతున్నట్లున్నాడు బావా!
సుబ్బారావు:
మరో విశేషం మరదలా! తెదేపాకి చెందిన పయ్యావుల కేశవులు, సూటిగా..."ఈ ఓదార్పు యాత్ర వల్ల సమాజానికి జరిగే తక్షణ నష్టమూ, లాభమూ ఏదీ లేదన్నాడు. రాజ్యాలేమీ కూలిపోవని చెప్పాడు. ఈ వివాదం కాంగ్రెస్ లో వ్యక్తి స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు" అని దుయ్యబట్టాడు. నిజమే కదా! ఓదార్పు యాత్ర చేస్తే రాజ్యాలు కూలుతాయా? ఎందుకంత గొడవ పడుతున్నారు?
సుబ్బలష్షిమి:
చూడబోతే ‘ఓదార్పుయాత్ర’ కేవలం పైకారణంలా ఉంది బావా! లోపల ఇంకేదో మరుగుతున్నట్లుంది. చూద్దాం! ఈ అంకం మరెన్ని మలుపులు తిరుగుతుందో! మరింత స్పష్టపడ్డాకైనా, ఎవరి గోల ఏమిటో తెలియక పోదు కదా?
Subscribe to:
Post Comments (Atom)
మీరన్నట్లు లోపల ఇంకేదో మరుగుతున్నట్లుంది.
ReplyDeleteమీరన్నట్లు, ఓదార్పు యాత్ర చేస్తే ఏంజరుగుతుందని వద్దని అంత పట్టుపడుతున్నారో అర్ధంకావడంలేదు. జగన్ అత్యంత శ్రేయొభిలాషులు పాల్వాయి,VH(ఏం.. వెటకారమా... అంటే నేనేం చెప్పలేను) ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్ళిన జగన్ కి ముందు ముందు ఎంజరుగుతుందో చూద్దాం. ఇంకొక పసందైన ఆలోచన.. VH కి రాజ్యసభ లభించిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా ’తీన్ మార్ జాతర’ తలపెడితే ఎలా వుంటుంది?
ReplyDelete