Thursday, July 22, 2010

ఈ ఆర్దికవేత్తలు సుత్తీ శాణాలు పట్టుకు తిరుగుతున్నారా?

[దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ ఛార్జీలను నెలకు రూ.250/- గా స్థిరీకరించాలని యోచిస్తున్నట్లు ’ట్రాయ్’, సుప్రీం కోర్టుకు తెలియజేసింది. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెక్నాలజీ పెరిగితే, పోటీ వలన ధరలు తగ్గి, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని... మన్మోహన్ సింగూ, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరాల వంటి ఆర్దిక వేత్తలు ఆదరంగా సెలవిస్తుంటారు కదా! మరి కేబుల్ టీవీల వంటి సేవలు, ఎందుకు రాను రాను మరింత అందనంత ధరకు ఎగిరి పోతున్నాయి బావా?

సుబ్బారావు:
సదరు మేధావులు ఆర్దిక సూత్రాలనీ, సిద్దాంతాలనీ సెలవిస్తున్నప్పుడు ఎదురు ప్రశ్నించకూడదు మరదలా! ఎందుకంటే అవి సిద్దాంత రాద్దాంతాలు మరి!

సుబ్బలష్షిమి:
అసలు నాకో పెద్ద అనుమానం బావా! ఈ మన్మోహను సింగూ, చిదంబరం గట్రా ఆర్దిక వేత్తలూ, మంత్రిపుంగవులూ జేబుల్లో పెన్నూ పేపర్ల బదులు, సుత్తీ శాణం పెట్టుకు తిరుగుతున్నారేమోనని?

సుబ్బారావు:
సుత్తీ శాణాలా? అవెందుకు మరదలా?

సుబ్బలష్షిమి:
ఎందుకేమిటి బావా! దొంగలు ఇళ్ళకి కన్నాలు వేయటానికి వాడేది అవే కదా? వీళ్ళూ ఇంకో రకంగా అదే పని చేస్తున్నారు. అంతే కదా తేడా?

2 comments:

  1. కేబుల్ టీవీల కిరాయిలు పెరగడానికి కారణం కేబుల్ మాఫియా. ఈ మధ్యన డిష్ కంపనీల రాకతో కేబుల్ కిరాయిలు తగ్గాయి.

    ReplyDelete
  2. నచికెత్ గారు నెనర్లండి.

    ReplyDelete