Sunday, June 13, 2010

ఈ దేహభాష ఏం చెబుతోంది?

[శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే భారత పర్యటన - వార్త నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:
బావా! శ్రీలంక అధ్యక్షుడు భారత్ వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం అయ్యాడు. ఆ ఫోటో చూశావా?

సుబ్బారావు:
చూశాను మరదలా! అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! పత్రికల వాళ్ళు, దేహభాషల గురించి తెగ వ్రాస్తుంటారు కదా! ఇంటర్వూల కెళ్ళినప్పుడూ, పరిచయాలప్పుడూ... `దేహభాషని బట్టి, అప్పటి ఆ వ్యక్తి మనఃస్థితిని చెప్పవచ్చనీ, అందుచేత అలా కూర్చొండి, ఇలా నిలుచోకండి' అనీ వ్రాస్తుంటారు.

మరయితే... రాజపక్సే, సోఫాలో వెనక్కి వాలి comfortable గా, ధీమాగా కూర్చొన్నాడు. సోనియా, సోఫాలో ముందుకు వంగి, విధేయత చూపిస్తున్నట్లుగా కూర్చుందేం బావా? ఎందుకంటావూ?

సుబ్బారావు:
ఏం చేస్తుంది మరదలా!? ఎల్.టి.టి.ఈ. పెద్దపులి, వేళిపిళ్ళై ప్రభాకరన్ తాలూకూ వ్యవహారాల రహస్యాలు, రాజపక్సే చేతిలో ఉన్నాయి మరి! వేళిపిళ్ళై ప్రభాకరన్ దొరికాడన్నప్పుడు... అమెరికా, బ్రిటన్ గట్రా దేశాల దగ్గర నుండి, మానవ హక్కుల సంఘాల దాకా... అందరూ, రాజపక్సే మీదకి సామ భేదాలు ఉపయోగించారు. అన్నింటిని దాటుకుని నిలబడ్డాడు. ఆ తర్వాత అందరూ అతడికి సాష్టాంగపడ్డారు. అప్పుడే... శివశంకర్ మీనన్ లూ, నారయణన్ లూ ఆఘమేఘాల మీద లంక చుట్టూ తిరిగారు మరి!

4 comments:

  1. మొత్తాని సోనియా కుర్చీకింద "టపాకాయ" పెట్టి సరిగా కూరోనియ్యకుండా చేశారు, హన్నా.......!!!
    చాలా బాగుంది టపా. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ఆయనకు పెద్ద బొజ్జ ఉన్నట్టుంది, ముందుకు కూర్చ్చోలేడేమో.

    ReplyDelete
  3. gaddeswarup గారు: మరీ అంత పొట్ట ఉందంటారా! :)

    తిక్క తింగరోడు గారు: కుర్చీ క్రింద టపాకాయలు ఇంకా చాలా ఉన్నాయండి. :)

    ReplyDelete
  4. దేహభాష body language కి మక్కికి మక్కి అనువాదం. దీనికి తెలుగులో హావభావాలు అంటారు.

    ReplyDelete