Friday, June 18, 2010

లేడీ డాన్ లదే రాజ్యం అనటానికి వేరే సర్వేలు కావాలా!?

[లేడీ డాన్ లదే రాజ్యం - వార్త నేపధ్యంలో
>>>లేడీ డాన్‌లదే రాజ్యం!
న్యూయార్క్‌: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేడీ డాన్‌లు పెరిగిపోతున్నారట! అంతా మహిళలే ఉండే గర్ల్స్‌ గ్యాం గుల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ కాదట!! జెనీవాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. నేర ప్రపంచంలో అతి వల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 6.6 లక్షల మంది మహిళా గ్యాంగ్‌స్టర్‌లు ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌లోని నేర గ్రూపుల్లో 25-50 శాతం వీరే ఉన్నారు. అయి తే, పురుష గ్యాంగ్‌స్టర్లతో పోలిస్తే.. వీరు తమ 'పని' పట్ల అంత సంతోషంగా లేరని అధ్యయనం తెలిపింది. 'తగాదాలు లేదా గొడవలు విషయానికొస్తే.. వీరు తుపాకులను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. కత్తులు, రాళ్లు వంటి ఆయుధాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు' అని పేర్కొంది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఈ అధ్యయన వివరాలను విడుదల చేశారు.]

సుబ్బలష్షిమి:
బావా! జెనీవాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం... లేడీ డాన్ లదే రాజ్యం అని వెల్లడైందట తెలుసా? వాళ్ళ ఆయుధాలు కత్తులూ, రాళ్ళట.

సుబ్బారావు:
ఆపాటి విషయం తెలుసుకోవటానికి తొక్కలో సర్వేలెందుకు మరదలా! సోనియా ప్రభుత్వాన్నీ, మాయావతి ప్రభుత్వాన్నీ చూస్తే తెలియటం లేదూ?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కాకపోతే వీళ్ళ అయుధాలు ఈవిఎం లూ, రాజకీయాలూ, పన్నులూ! అంతే తేడా!

3 comments:

  1. కాని ఒక విషయం అర్దమైనది. మరి పోపుల డబ్బాల్ని, గిన్నెలుని, గరిటలని వదిలేసినట్టున్నారు. ఆడవాళ్ళ గురించి మీ సర్వేలు బాగున్నాయి.

    ReplyDelete
  2. anderson case ను కాంగ్రెస్ ప్రభుత్వం PV నరసింహ రావు మీదకు తోస్తున్నది . మీరు దీని మీద దయ చేసి వ్యఖానిచండి. ఈ బ్లాగ్కి సంబంధం లేకుండా రాసి నందు కు క్షమించండి

    ReplyDelete
  3. భవాని గారు: నేను రాజకీయ డాన్ ల గురించి చెప్పానండి. మీరేమో వంటింటి డాన్ ల గురించి చెప్తున్నారు!:)

    అజ్ఞాత గారు: ఇల్లు అలకగానే పండగయిపోదండి. వాళ్ళు వేసే నాటకాలన్నీ పూర్తికానివ్వండి.

    ReplyDelete