Monday, June 21, 2010

ఆర్దికంగా ఓపలేక సైకిలెక్కితే అదో ట్రెండయి పోయిందా?

[అమెరికాలో సైక్లింగ్, నడక పెరిగింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇక్కడేమో కార్లు, బైకుల జోరు రోజురోజుకీ పెరిగిపోతుంటే.. అమెరికాలో మాత్రం సైకిల్‌పై వెళ్లేవారు, పాదచారుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోందట! 2001 నుంచి 2009 మధ్య వీరి సంఖ్య 25 శాతం పెరిగిందని ఫెడరల్‌ హైవే అడ్మినిస్ట్రేషన్‌ నిర్వహించిన నేషనల్‌ హౌస్‌హోల్డ్‌ ట్రావెల్‌ సర్వే తెలిపింది. ప్రయాణ భద్రత విషయంలో అమెరికన్లు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారని పేర్కొంది, తెలుసా?

ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరముందని అమెరికా రవాణా శాఖ మంత్రి రే లాహుడ్‌ తెలిపారు. సైక్లింగ్‌ను, పాదచారుల సంఖ్యను ప్రోత్సహించేందుకు ఇటీవలే లాహుడ్‌ ఓ విధానాన్ని ప్రకటించారు కూడా!

సుబ్బారావు:
ఎంత పాజిటివ్ కాప్షన్ మరదలా! ఆర్దికమాంద్యం పులిలా మీదపడితే, ఉద్యోగాలు ఊడుతుంటే , ఆదాయాలు పడిపోతుంటే...కార్లు పక్కన పెట్టి, సైకిళ్ళెక్కక ఏంచేస్తారు? అది కూడా ఒక ట్రెండ్ అని, అక్కడి మంత్రి కితాబిస్తున్నాడన్న మాట!

సుబ్బలష్షిమి:
అయితే, ఆర్దికంగా ఓపలేక సైకిలెక్కితే అదో ట్రెండయి పోయిందా?

3 comments:

  1. నాకు తెలిసి విదేశాలలొ సైకిల్ తొక్కడానికి, ఆర్ధిక లావాదేవిలకు సంబందంలేదు, ఆరోగ్య రీత్య విదేశాలలో సైకిల్ వాడతారనుకుంటా?

    ReplyDelete
  2. నేనలా అనుకోవడం లేదండీ. చాలావరకు వాళ్ళు సైక్లింగ్ జిమ్ లో చేస్తారే తప్ప బయట చెయ్యరని నా అభిప్రాయం(తప్పు కూడా కావచ్చు) ఎందుకంటే అక్కడ పనికి,ఇంటికి చాలా దూరం ఉంటుంది అంటారు. ఐనా సైకిల్ వాడుతున్నారంటే ఏమ్ చెప్తాం.

    వాళ్ళ టెక్నిక్ వాళ్ళది. ఇప్పుడు చూస్కోండి మీడియా కావాలంటే దీన్నే ఓ పెద్ద న్యూస్ గా తయారు చేసి, సైక్లింగ్ కాంపేన్ లు నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

    ReplyDelete
  3. రవాణా శాఖ మంత్రి, రే లాహుడ్‌ గారి సైకిల్ కంపెనీ పేరు ఏమిటొ?

    ReplyDelete