Tuesday, June 15, 2010

వేలుపిళ్ళై ప్రభాకరన్ లూ, అండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంలూ....!

[‘భారత్ కోరితే అండర్సన్ ని అప్పగించే విషయం జాగ్రత్తగా పరిశీలిస్తాం’ అంటున్న అమెరికా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ తాజాగా కోరితే అండర్సన్ ని అప్పగించే విషయం జాగ్రత్తగా పరిశీలిస్తానందట అమెరికా! భోపాల్ బాధితులు అమెరికా అధ్యక్షుడు ఒబామాకి, అండర్సన్ ని భారత్ కు అప్పగించాల్సిందింగా కోరుతూ లేఖ వ్రాసారట. యూపీఏ ప్రభుత్వాధినేతలు మాత్రం, అండర్సన్ ని అప్పగించమని కోరనే లేదు చూశావా!

సుబ్బారావు:
గత సంవత్సరంలో శ్రీలంక కూడా ‘భారత్ కోరితే ఎల్టీటీఇ ఛీఫ్ వేలుపిళ్ళై ప్రభాకరన్ ని అప్పగిస్తానంది’ మరదలా! అప్పుడూ ఇలాగే యూపీఏ ప్రభుత్వం గానీ, సాక్షాత్తూ రాజీవ్ గాంధీ భార్య, ప్రభుత్వ కుర్చీవ్యక్తి అయిన సోనియా గానీ, కిమ్మనలేదు. అంతలో యుద్దంలో ప్రభాకరన్ మరణించాడని లంక ప్రకటించింది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వేలుపిళ్ళై ప్రభాకరన్ లూ, అండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంలూ.... వీళ్ళందరికీ సానుకూలంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయి గానీ, శిక్షించడానికి పనిచేస్తాయా?

2 comments:

  1. గురువుగారు,
    అండర్సన్ లూ, దావూద్ ఇబ్రహీంల పట్టికలో ప్రభాకరన్ ను చేర్చటం కరెక్టంటారా?

    ReplyDelete
  2. మీ అభిమానం మీది!

    ReplyDelete