Saturday, April 3, 2010

సింగినాదం జీలకర్ర అంటే ఇదే!

[డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబై ముట్టడికి ఏకైక సూత్రధారుడు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ డేవిడ్ కోల్మన్ హెడ్లీనే, మొదటి నుండి చివరి వరకూ, ఉగ్రవాద సంస్థల సహాయంతో 26/11, 2008 లో జరిగిన ముంబై ముట్టడి నిర్వహించాడట. పాకిస్తాన్, ఐ.ఎస్.ఐ. ల హస్తం ఏమాత్రం లేదట. తెలుసా?

సుబ్బారావు:
పాకిస్తాన్ నీ, ఐ.ఎస్.ఐ.ని తప్పించేందుకే కదా మరదలా, అటు అమెరికా ప్రభుత్వమూ, ఇటు సోనియా ప్రభుత్వమూ.... ఓ మోస్తరు టెర్రరిస్టు డేవిడ్ కోల్మన్ హెడ్లీని సూపర్ డూపర్ టెర్రరిస్టుగా హైలైట్ చేస్తోంది?

సుబ్బలష్షిమి:
అదా హెడ్లీ హెడ్ లైన్ వార్తలకి మూల కారణం? మొత్తానికీ పెద్ద సింగినాదం - జీల కర్రే బావా!?

~~~~~

సింగినాదం - జీలకర్ర వెనుక నున్న కథ:
ఒకప్పుడు రేవుపట్టణాలకి, యూరోపియనులు సుగంధ ద్రవ్యాలు కొనటానికి వచ్చేవాళ్ళు కదా! అలా వచ్చినప్పుడు రేవులో ఓడకి లంగరు వేయగానే, కొమ్ముబూర ఊదుతూ వీధుల్లో కొందరు యూరోపియనులు తిరిగేవారట. సుగంధ ద్రవ్యాలు కొనటానికి తాము వచ్చాము అని ప్రజలకి అలా వాణిజ్య ప్రకటన ఇచ్చేవాళ్ళన్న మాట. ప్రజలంతా తాము సేకరించిన, నిల్వచేసిన జీలకర్ర, యాలకులు, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలు తీసుకొని రేవుకు చేరి, అవి ఇచ్చి బంగారం పుచ్చుకునేవాళ్ళట.

కొన్నాళ్ళ తర్వాత ఇలాగే కొందరు యూరోపియనులు కొమ్ముబూర ఊదటమూ, వీధుల్లో తిరగటం.... జనమంతా.... మగవాళ్ళు, యువకులు, రేవుకు పోవటం.... మరోవైపు నుండి దొంగలు వచ్చి ఇళ్ళుదోచుకుపోవటం చేశారట. దాంతో ’కొమ్ముబూర నమ్మితే జీలకర్ర అమ్మగా వచ్చిన బంగారం కాస్తా పోతుంది’ అనుకునేవారట ప్రజలు. కొన్నాళ్ళకి దాన్నే short cut గా ’శృంగనాదం - జీలకర్ర’ అనటం మొదలు పెట్టారట. అసత్య వాణిజ్య ప్రకటనలు నమ్మకు మోసపోతావు అనే సందర్భంలో అవి వాడేవారట. ప్రజా బాహుళ్యంలో శృంగనాదం కాస్తా సింగినాదం అయ్యింది. క్రమంగా అసత్యాలు నమ్మకు అనే సంధర్బంలో ’సింగినాదం - జీలకర్ర కాదూ!?’ అనటం పరిపాటి అయ్యింది.

2 comments:

  1. హార్నీ.. సింగినాదం - జీలకర్ర వెనుక నున్న కథ ఇదాండి.. ఇంతకు ముందేవడొ (బ్లాగుల్లొనే ) ఈ సమెత ఎలా వచ్చిందొ అని ఒక చెత్త స్టొరీ చెప్పాడు..అప్పుడు నమ్మలెదు అనుకొండి ..

    ధన్యవాదాలు లక్ష్మి గారు .. ఈ హెడ్లీ ది ఎంత పకడ్బందీగా చేస్తున్నారొ చూడండి

    ReplyDelete
  2. మంచుపల్లకీ గారు : సింగినాదం - జీలకర్ర కథ నేను డాక్టర్ సి.తిరుమల రామచంద్రగారు వ్రాసిన నుడి-నానుడి పుస్తకంలో చదివానండి. చిన్నప్పుడు వక్తృత పోటీలో బహుమతిగా సంపాదించుకున్న పుస్తకం అది. సూర్యాపేటలో పోగొట్టుకున్న గృహ గ్రంధాలయంలో ఉండిపోయింది.

    ReplyDelete